24 కిస్సెస్ ట్రైలర్...మత్తెక్కిస్తున్న హెబ్బాపటేల్...

11:52 - October 25, 2018

హెబ్బా పటేల్...కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన భామ. 2014 సంవత్సరంలో తిరుమనం ఎనుం నిఖా చిత్రం ద్వారా తమిళ సినీ రంగంలోకి ప్రవేశించింది. తెలుగులో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’తో సంచలనంగా మారిపోయింది. ఈ సినిమా ద్వారా యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొన్ని చిత్రాలు చేసినా అంతగా విజయాలు సాధించలేదు. తాను బోల్డ్ రోల్స్‌ కూడా చేస్తానని వెల్లడించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
‘24 కిస్సెస్’...లో హెబ్బా నటిస్తోంది. ఇందులో అరుణ్ అదిత్ హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ డ్రామా తెరకెక్కుతున్న ఈ సినిమాను అయోధ్య కుమార్ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సినిమా టైటిల్ లాగానే హెబ్బా రెచ్చిపోయింది. ముద్దుల వర్షం కురిపించారు. అందచందాలను ఆరబోసిన హెబ్బా మరోసారి కనువిందు చేయనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ సాంగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. హెబ్బ...అరుణ్ మధ్య సన్నివేశాలను హాట్ హాట్‌గా తెరకెక్కించారు. 
మొత్తం కథని రావు రమేష్‌కు హీరో ఆదిత్ వివరిస్తుంటాడు. రావు రమేష్ డైలాగులు హాస్యాన్ని పండించే విధంగా ఉన్నాయి. యువతని ఆకర్షించేలా రొమాంటిక్ సీన్స్ రూపొందించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Don't Miss