ఇలాంటి పోలింగ్ కేంద్రం చూశారా ? ఖమ్మంలో ఆదర్శ మహిళా పోలింగ్..

07:06 - December 7, 2018

ఖమ్మం :  తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7వ తేదీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలోని రికా బజార్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం అందర్నీ ఆకర్షిస్తోంది. మహిళల కోసం ఆకట్టుకొనే విధంగా పోలింగ్ బూత్‌ని ఏర్పాటు చేశారు. స్వాగత తోరణాలు..రెడ్ కార్పెట్..పూలతో అందంగా అలంకరించారు. ఇక్కడ విధులు నిర్వహించే మహిళలకు ప్రత్యేక డ్రెస్ కోడ్‌ని ఏర్పాటు చేయడం విశేషం. ఎండ తగులకుండా..మంచి నీటి సదుపాయం..మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. భారతదేశ ఎన్నికల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అధికారి తెలిపారు. మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారనేది ఇక్కడ చూడవచ్చన్నారు. 
ఖమ్మంలో పది నియోజకవర్గాలు...
ఖమ్మం పది నియోజకవర్గాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలో 5 నియోజకవర్గాలు..భద్రాద్రి కొత్తగూడెం 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుండి సాయంత్రం 4గంటలకు మాత్రమే పోలింగ్ జరుగనుంది. 

Don't Miss