ఎంటికెల్నే నెత్తికి సుట్టుకుంటున్న పెద్దమన్షి..

20:33 - May 4, 2018

అయ్యో నీ వానలు సల్లగుండగదరా..? ఏం వానలు అవ్వి ఏట్లె వానలు.. వడగండ్ల వానలు జనంతోని మూడో ప్రపంచయుద్దం జేశినట్టే ఉన్నది.. ముఖ్యంగ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పొంటి ఆగమాగం జేశింది వడగండ్ల వాన.. హైద్రావాదుల భూకంపం బుట్టిస్తాని కేసీఆర్ జెప్తె.. భూకంపం బదులు వడగండ్ల వాన మోపైంది.. మొత్తానికి జనం బత్కు సత్రోలైందనే చెప్పవల్సుంటది..

ఊరంత ఒకటుంటే ఊసుగండ్లోనికి ఇంకొకటన్నట్టు.. లోకమంతనేమో వడగండ్ల వానొచ్చి ఆగమైతిమిగదరా అని లొల్లివెడ్తుంటే.. ఒకతాన టీఆర్ఎసోళ్లు, బీజేపోళ్లు ఫ్లెక్సీలు గట్టిండ్రు.. జనాన్ని ఉద్దరిచ్చె ఫ్లెక్సీలు గావు మళ్ల.. వాళ్ల భూములు జాగలు అమ్మి లోకాన్ని ఉద్దరిస్తున్నమన్న కలరింగిచ్చె కటౌట్లు వెట్టిండ్రు పాండ్రి సూపెడ్త దాని యవ్వారమేందో..

ఎన్డీయేకు చంద్రబాబుకు విడాకులు ఎందుకైనయో తెల్సా..? ముఖ్యమంత్రి చంద్రబాబే బీజేపీకి మిత్రద్రోహం జేశిండట.. అందుకే టీడీపీ ఎన్డీయే నుంచి బైటికొచ్చిందట.. ఈమాట ఎవ్వలో బైటి మన్షి అన్నది గాదు.. కుద్దు చంద్రాలు కింద పనిజేస్తున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి జెప్పిన మాట.. పొరపాటునో గ్రహపాటునో మొత్తం మీద నిజం గక్కేశిండు మీడియా ముంగట..

కళ్యాణానికి ఒక్కడొస్తె.. కన్నమేస్తందుకు ఇంకొకడొచ్చినట్టు.. పాపం పేదలకు ఎన్కట భూములు వంచి అండ్ల బత్కుండ్రని అప్పటి పాలకులు జెప్తె.. ఇప్పటి పాలకులు ఉన్న భూమిని గద్దల పాలు జేస్తున్నరట.. మంత్రి కల్వకుంట్ల తారకరామారావుగారు ఎమ్మెల్యేగునన్న సిరిసిల్ల నియోజకవర్గం కథ ఇది.. జనం వచ్చి రెండు చేతులు జోడిచ్చి నీకు దండం బెడ్తం మమ్ముల మోసం జేయకుండ్రి అని చెప్తున్నరు..

విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాల్టీలళ్ల సాఫ్ సఫాయి కార్మికులు బిచ్చమెత్తుకుంటున్నరు.. వీళ్లు బిచ్చమెత్తుకుంటున్నరంటే.. స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ నారా చంద్రాలుగారు , ఆయన మంత్రి నారాయణ వారు శిగ్గుతోని తల్కాయ దించుకోవాలె గదా..? వాళ్లకు ఆపాటి శరం ఏముండదిగని.. మరి వీళ్ల బిచ్చం సంగతేందో సూద్దాం పాండ్రి..

ఇంకో రెండు నెలలళ్ల ప్రతి గుడ్సెకు.. ప్రతి గూడానికి.. ప్రతి పల్లెకు మంచి నీళ్లు తాపియ్యబోతున్నం.. ఇప్పటికే మిషన్ కాకతీయతోని చెర్వులన్ని చెలచెల మెరుస్తున్నయ్.. అని ఒకతాన ముచ్చట జెప్పుకొచ్చింది మెదక్ ఎమ్మెల్యే పద్మమ్మ.. అమ్మగారు అటు ముచ్చట జెప్తుంటే.. ఇంకో దిక్కు తాగునీళ్ల కోసం తక్లీవు వడ్తున్న ఆడోళ్లు బిందెలు వట్కోని రొడ్డెక్కిండ్రు..

అయ్యా కర్నూలు కలెక్టర్ గారు.. మీరు పనిజేస్తున్నరా నిద్రవోతున్నరా..? రైతుకు నష్టపరిహారం ఇయ్యాల్నంటే మీ కింది అధికారులకు లంచం ఇయ్యాల్నంటగదా..? మీ జిల్లాలున్న పాణ్యం మండలం తమ్మరాజు పల్లెకాడ సర్వేయరుగారు యాభైవేల రూపాలు ఇస్తెనే నీకు పరిహారం వచ్చెతట్టు జేస్తాని డిమాండు జేస్తున్నరట.. మరి మీకు గూడ చాలసార్లు చెప్పుకుంటె మీరు పట్టిచ్చుకుంటలేరటగదా..? ఇను రైతు గోస..

నెత్తెంటికెలు బెత్తడు వెర్గితెనే శిటశిటాంటది.. ఎప్పుడు ఉర్కుదామా మంగలాయితానికి ఎప్పుడు కటింగు జేపిచ్చుకుందామా అని సూస్తరు.. కని కొంతమంది ఉంటరు జుట్టు వెంచెటోళ్లు గూడ.. కని గుజరాత్ రాష్ట్రంల నెత్తికి రుమాలు జుట్టుకునుడు బంజేశి.. నెత్తికి ఎంటికెలే సుట్టుకుంటున్నడు ఒక పెద్దమన్షి.. పదిహేను మీటర్ల పొడ్గు సూడుండ్రి..

Don't Miss