కరీంనగర్‌లో బారులు తీరిన ఓటర్లు...

07:24 - December 7, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కరీంనగర్‌లో ఎన్నికల అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. తెల్లవారుజామునే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. పది నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమయ్యే సూచనలున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ సతీసమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ ప్రారంభం కాకముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 13 నియోజకవర్గాలున్నాయి. మంథని నియోజకవర్గంలో ఒక గంట ముందుగానే పోలింగ్ ముగిసేందుకు ఎన్నికల అధికారులు అనుమతినిచ్చారు. 
13 అసెంబ్లీ నియోజకవర్గాలు...
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 181 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 25 మంది పోటీ పడుతున్నారు. 27 లక్షల 85 వేల 787 మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 3519 పోలింగ్ కేంద్రాలుండగా... 735 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించిన అధికారులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 

Don't Miss