కుక్క పిల్లల యాపారి ఏం జేసిండో సూడుండ్రి..

20:28 - May 11, 2018

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. బుర్దల బొర్రిన పందికి పెద్ద తేడా లేదంటున్నడు.. సత్పురుషుడు.. అవినీతి అంటె ఏందో తెల్వనోడు.. నీతికి నిల్వుటద్దం.. వెన్నుపోటంటె ఎట్లుంటదో తెల్వని మహానేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు... నా నల్పై ఏండ్ల రాజకీయ జీవితంల ఎన్నడు గింత మచ్చ అంటలేదు నాకు.. అందుకే నన్ను ఎవ్వలేం జేయలేరనుకొచ్చిండు..

ఏగిలం మోపైందిగదా రైతు బందు చెక్కులు.. బుక్కుల కాడ.. ఒక ఆడామె ఏడ్సుడొక్కటే తక్వున్నది.. పాత పాసు బుక్కుల ఆమెకు రెండు ఎక్రాల భూముంటే.. బంగారు తెలంగాణ సర్కారు ఇచ్చిన బుక్కుల పన్నెండు గుంటల భూమే ఉన్నట్టు సూపెట్టిండ్రట.. ఇగ సూస్కో ఆమె పరేషాన్ అయితున్నది..

గద్వాల జిల్లాల గలాటా గిది..కంట్రోలు బియ్యంతోని పేదల కడ్పునిండుడేమోగని.. దొంగలు దోపిడిగాళ్లకు జేవులు మాత్రం నిండుతున్నయ్.. వాస్తవానికి గూడ ఆ కంట్రోలు బియ్యం నిన్నియాళ్ల జనం తింటనే లేరు.. ఇగ ఇదే బియ్యాన్ని లారీలకు లారీలు దీస్కపోయి పాలీష్ జేశి అమ్ముతున్నరట.. కంట్రోలు బియ్యం ఎత్కపోతున్న లారీలను పోలీసోళ్లు ఖమ్మం జిల్లాల వట్కున్నరు..

మొన్ననే జెప్పలే నేను ఆడివిల్లకు చిన్నతనంల పెండ్లీలు జేయుండ్రి అప్పటిలెక్క లేదు యవ్వారం అధికారులొచ్చి ఆపేస్తరు పెండ్ల.. పెండ్లి ఖర్చులు సుట్టాలు.. బోజనాలు అన్ని ఉత్తయే అయితయ్ తర్వాత బాధపడుండ్రి అని గూడ జెప్తి ఇంటరా జనం.. ఇగో ఎన్మిదో తర్గతి సద్వుతున్న బుజ్జికి పెండ్లి జేయ జూశిండ్రు పెండ్లి ఆగిపోయింది..

పోలీసోళ్లు వైన్సు దుక్నం కాడికి ఎప్పుడు రావాలే..? ఆడేమన్న తాగినోళ్లు తన్నుకుంటుంటె రావాలే.. ఏదన్న న్యూసెన్సు అయితే రావాలే.. లేకపోతె మద్యం షాపు టైం దాటినంక గూడ అమ్మితె రావాలే అంతేనా.? కని ప్రకాశం జిల్లా చీరాల కాడ ఒక సీఐ వానికి నెత్తిల పుర్గుగూడ తిర్గిందో లేకపోతె మద్యం షాపోడు మామూలు ఇస్తలేడనుకున్నడో ఏమో.. వచ్చి హల్ చల్ జేశిపోయిండు జర్రశేపట్ల..

ఉపాయం ఉన్నోడు ఉపాసం ఎన్నడుండడు.. కుక్క పిల్లలను అమ్ముకోని బత్కెడోడు ఎంత పెద్ద ఉపాయం గట్టిండో సూడుండ్రి కడప జిల్లాల పార్థు గ్యాంగు తిర్గుతున్నదని జనం భయపడ్తున్నరుగదా..? అగో ఆ భయాన్ని ఆసర జేస్కోని నిజమే పార్థు గ్యాంగు తిర్గుతున్నది.. కావట్టి మీరు ఇంటికో కుక్కను వెంచుకోండ్రి అని కుక్క పిల్లలు దొర్కే అడ్రసుగూడ వెట్టిండట.. సూడుండ్రి వాని వ్యాపర తెల్వి ఎట్లున్నదో..

సారూ మన ఆఫీసుల పనిజేస్తున్న రజియొద్దిన్ గాడు నన్ను వేధిస్తున్నడు.. బట్టలిప్పి ఉర్కిస్తాంటున్నడు నేను ఆడమన్షిని జర్ర మీరే చర్యలు దీస్కోండ్రి అని ఉన్నతాధికారులకు జెప్పింది వాళ్లు వట్టిచ్చుకోలే.. ఆఖరికి షీటీమ్సును వేడుకున్నది ఆళ్లు వట్టిచ్చుకోలే ఇగ టెన్ టీవీ ఒక్కటే దిక్కు నా గోడు జెప్పుకునెతందుకు అని ఒక సర్కారు ఆఫీసు ఉద్యోగి మన ముంగటికొచ్చింది..

చిర్తపులులు ఇట్ల సచ్చిపోతున్నయెందుకో ఏమో.. గామొన్న తిరుమల కొండలెక్కే తొవ్వల టక్కరై ఒక చిర్తపులి సచ్చిపోయింది.. ఇయ్యాళ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం తండకాడ ఇంకో చిర్తపులి యాక్సిడెంట్ల జీవిడ్సింది.. ఇంతకు చిర్తలు రోడ్ల మీదికి ఎందుకొస్తున్నయో ఏమో ఈ నడ్మ బాగైతున్నయ్ ఇసొంటియి..

Don't Miss