ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి :యడ్యూరప్ప

18:59 - May 16, 2018

కర్ణాటక : బీఎస్‌ యడ్యూరప్ప బిజెపి శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన గవర్నర్‌ వజుభాయ్‌ వాలాను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్‌ను కోరారు. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని గడువు కోరినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. 222 అసెంబ్లీ స్థానాలకు గాను బిజెపికి 104 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటు మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. స్వతంత్ర అభ్యర్థి శంకర్‌ బిజెపికి మద్దతు తెలపడంతో ఆ పార్టీ సంఖ్యా బలం 105కి చేరింది.

Don't Miss