సమగ్రమైన యూత్ పాలసీ కావాలి : దేవి

21:00 - March 30, 2018

హైదరాబాద్ నడిబొడ్డున మైనర్ బాలిక ప్రేమోన్మాదానికి బలైంది... ఈ ఒక్క సంఘటనేకాదు ఈమధ్య కాలంలో భాగ్యనగరంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. చుట్టూ పోలీసుల పహారా, రక్షణకు షీటీమ్స్ ఉన్నా... రాజధానిలో మహిళలపై దాడులు జరుగుతున్నాయంటే ప్రేమోన్మాదం ఎంత సృతిమించుతుందో అర్థం చేసుకోవచ్చు... ప్రస్తుతం ఈ ఘటన స్త్రీకి ఉన్న రక్షణ ఎంత అని పాలకులను ప్రశ్నిస్తుంది. ఇదే అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ప్రేమోన్మాదుల దాడులపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి పాల్గొని, మాట్లాడారు. సమగ్రమైన యూత్ పాలసీ కావాలని సామాజిక కార్యకర్త దేవి అన్నారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని చెప్పారు.
ఆ వివరాలను ఆమె మాటల్లోనే...
బాలికలకు భ్రదత కల్పించడమంటే ఇంటికో కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయడం కాదు. చట్టం చేయడం కాదు.. వాటిని అమలు చేసి చూపించాలి. బాల్య వివాహాల చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. స్త్రీలకు సబంధించిన ఏ ఒక్క చట్టాన్ని అమలు చేయడం లేదు. సత్వరంగా జరగని న్యాయం... న్యాయం కాకుండా పోతుంది. ప్రతిస్థాయిలో రాజకీయ జోక్యం ఉంటుంది. పోలీసు స్టేషన్ లో రాజకీయ దళారులు కూర్చుంటారు. చట్టం దాదాపు పనిచేయకుండా ఉంటుంది. చట్టం గురించి జనం పట్టించుకోవడం లేదు. నేరస్తుడు, బాదితుడు చట్టాలను నమ్మడం లేదు. నీతిబోధల వల్ల సమాజం మారదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Don't Miss