మిడ్ మానేరు ముంపు బాధితుల ధర్నా

19:36 - April 2, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లా ముంపు గ్రామ మహిళలు కలెక్టరేట్ ముందు మండుటెండలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం చేవెళ్ళప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా మాన్వాడ వద్ద మిడ్ మానేరు జలాశయాన్ని నిర్మిస్తోంది. అందులో భాగంగా మాన్వాడను ముంపు గ్రామాన్ని ప్రకటించింది. కొంతమందికి  నష్ట పరిహారం రాకపోవడంతో డీఆర్ఓ శ్యాం ప్రసాద్ లాల్‌కు తెలపగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని బాధిత మహిళలు ఆరోపించారు.  కొలతల సమయంలో పరిహారం కోసం... అధికారులు, సర్పంచ్‌కు సుమారు 20వేల వరకు ముట్టజెప్పామని బాధితులు పేర్కొన్నారు. 

Don't Miss