రోజా మహిళేనా ? -బోండా ఉమ..

08:21 - March 16, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం కొనసాగనున్నాయి. ఈ రోజు జరిగే సమావేశాల్లో పలు అంశాలు చర్చకు రానున్నాయి. గవర్నర్ ప్రసంగంపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం..పర్యాటక – సాంస్కృతిక, వారసత్వ చట్టం, ఎక్సైజ్ బిల్లు, వ్యాట్ బిల్లులు సభ ఎదుట రానున్నాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల కమిటీ నివేదిక సమర్పించనుంది. ఏడాదిపాటు సస్పెండ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ టెన్ టివితో మాట్లాడారు. రోజా అసలు మహిళేనా అని ప్రశ్నించారు. ఆమెను చూసి మహిళలే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. కాళ్లు చూపించడం చూశామని..తోటి సభ్యులపై ఏ విధంగా ప్రవర్తించారో చూశారని పేర్కొన్నారు. ఇంట్లో ఏ విధంగానైనా ఉండవచ్చు..లోటస్ పాండ్ లో ఏ విధంగానైనా ఉండవచ్చు...కానీ ఇది ఏపీ అసెంబ్లీ అని పలు వ్యాఖ్యలు చేశారు. బోండా ఇంకా ఏమన్నారో వీడియోలో చూడండి.

Don't Miss