హీరో శివాజీపై బీజేపీ దాడి!!..

19:07 - May 16, 2018

కృష్ణా : గన్నవరం విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ న్యూ ఢిల్లీ నుంచి విమానంలో కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు విమనాశ్రయానికి వెళ్లారు. అయితే, అదే సమయంలో సినీ నటుడు శివాజీ హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు. ఈనేపథ్యంలో శివాజీని చూసిన బీజేపీ శ్రేణులు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే విమర్శలు చేస్తావా? అంటూ శివాజీని అడ్డుకున్నారు. తీవ్ర వాగ్వాదం చెలరేగుతుండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శివాజీని పోలీసులు కారులో ఎక్కించి పంపించివేశారు. 

Don't Miss