హలో మూవీ రివ్యూ..

20:53 - December 22, 2017

అఖిల్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అక్కినేని మూడో తరం నటవారసుడైన అఖిల్ నుహీరోగా నిలబెట్టాలని రంగంలోకి దిగి అన్నివిధాలుగా కేర్ తీసుకుని చేసినసినిమా హలో..మనం డైరెక్టర్ విక్రమ్. కె. కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై హ్యూజ్ హైప్ క్రియేట్ అయ్యింది. అలా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా ఎలా ఉ:ది..? అఖిల్ కి తొలి హిట్ దక్కిందా లేదా.. నాగార్జున నమ్మకం ఎంత వరకూ నిలబడిందో ఇప్పుడు చూద్దాం.
కథ     
సినిమా కథ విషయానికొస్తే.. చాలా రొటీన్ లైన్. చిన్నప్పుడే కలిసి ప్రాణస్నేహితులుగా మారతారు శ్రీను, జున్ను. జున్ను వాళ్ల నాన్నకు  ట్రాన్స్ ఫర్ కావడంతో న్యూడిల్లీ వెళ్లిపోతుంది. అనాధ అయిన శ్రీనుని ప్రకాష్, సరోజిని లు దత్తత తీసుకుని అవినాష్ అని పేరు పెట్టుకుని పెంచుతారు. అయితే చిన్నప్పుడు జున్ను, శ్రీను ల మధ్య ఏర్పడిన స్నేహం వాళ్లతో పెరిగి ఎఫెక్షన్ గా మారుతుంది. అయితే ఈ లోగా ..జున్ను వాళ్ల నాన్నకి యు.ఎస్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఆ అమ్మాయి ఇంకో వారం రోజుల్లో అమెరికా వెల్లిపోవడంతో చివరిసారిగా శ్రీనును వెతికే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ కు వస్తుంది. జున్నునే తన సోల్ మేట్ అని అర్థమైన శ్రీను కూడా వెతుకుతుంటాడు. కానీ వేరే పేర్లతో కలుసుకున్న జున్ను,శ్రీను ఒకరినొకరు ఎలా కలిశారు ..? ఎలా గుర్తుపట్టారు అన్నది సినిమాచూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు..
నటీనటుల విషయానికొస్తే..మొదటి సినిమాలో ఒక్కడాన్సులు మినహా అన్ని విషయాల్లో నిరాశపరచిన అఖిల్...ఈ సినిమాలో చాలా ఇంప్రూవ్ మెంట్ చూపించాడు. నటనపరంగా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫైట్స్ లో కూడా  చాలా హార్డ్ వర్క్ తో రిస్కీ షాట్స్ చేసి మెప్పించాడు.  ఎమోషనల్ సీన్స్ లో తనను తాను డెవలప్ చేసుకుంటే అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి మరో మంచి హీరో వచ్చినట్టే. ఇక హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ..డీసెంట్ లుక్స్ తో ఇంప్రెస్ చేసింది. నటనపరంగా లిమిటెడ్ స్కోప్ ఉన్న రోల్  చేసి బానే మెప్పించింది. అయితే మంచి ఫర్ ఫార్మర్ గా పేరుతెచ్చుకునే అవకాశాలు ఎక్కువున్నాయి. రమ్యకృష్ణ , జగపతిబాబు తమ పాత్రలను చాలా ఈజీగా క్యారీ చేసి సినిమాకి ప్లస్ గా నిలిచారు. అనీష్ కురువిల్ల, సత్య కృష్ణన్, పోసాని, అజయ్.. తమ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ల నటనతో మెప్పించారు.
టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానొకస్తే..ఇష్క్, మనం సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా , సెన్సిబుల్ రైటర్ గా పేరుతెచ్చుకున్న  విక్రమ్ కె. కుమార్..ఈ సినిమా వరకూ మాత్రం ఫీల్ ఉన్న ఫ్లాట్ లైన్ ని  స్టోరీ ప్లాట్ గా తీసుకున్నాడు. అయితే సోల్ మేట్ అన్న పదానికి మీనింగ్  చెప్పడానికి చైల్డ్ హుడ్ ఎపిసోడ్ ని కాస్త్ ఎక్కువగా సాగదీశాడు. ఇక అలాగే మిగతా స్టోరీలో కూడా ఎంటర్ టైన్ మెంట్ కోషియంట్ బాగా తగ్గింది. ఫీల్ మీద  ఎక్కువ కాన్ సన్ ట్రేట్ చేసిన విక్రమ్ కె. కుమార్ కు నెరేషన్ లో గ్రిప్పింగ్ తగ్గింది. దాంతో అక్కడక్కడా బాగా ఎగిసిన గ్రాఫ్..కొన్ని చోట్ల మాత్రం బాగా పడిపోయింది. సెకండాఫ్ లో చిన్న చిన్న లాగ్స్ ఉండడం కూడా సినిమాకు కాస్త్ మైనస్ గా మారింది. డైరెక్టర్ విక్రమ్ వరకూ పూర్తిగా సంతృప్తి పరచకపోయినా...చాలావరకూ మెప్పించాడనే చెప్పాలి. ఇక మ్యూజిక్  అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్ . వినోద్.. ఇలా అంతా కూడా మనం సినిమాకు పనిచేసిన  టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. ముఖ్యంగా అనూప్ రూబెన్స్ కి  ఈ సినిమా  50వ సినిమా కావడం, మ్యూజిక్ కి బాగా స్కోప్ ఉండడంతో సినిమా స్తాయిని పెంచే సంగీతాన్ని అందించాడు. పాటలతో ఆకట్టుకున్న అనూప్, బ్యాక్ గ్రౌండ్  స్కోర్ లో కూడా తన మార్క్ చూపించి.. సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు.  పి.ఎస్ . వినోద్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫైట్స్ , పాటల్లో సినిమా గ్రాండియర్ ను  బాగా ఎలివేట్ చేశాడు.  ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంది. రన్ టైమ్ ఈ సినిమాకి ప్లస్. నిర్మాత నాగార్జున ఈ సినిమాతో అఖిల్ ను అన్ని రకాలుగా మెప్పిచే హీరోగా ప్రజెంట్ చెయ్యడానికి శ్రమించాడని అర్ధమవుతుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.  

ఓవరాల్ గా చెప్పాలంటే హలో అనే క్లాస్ టైటిల్ తో థియేటర్స్ లోకొచ్చిన ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి, యూత్ కి  ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఫైట్స్ అండ్ సాంగ్స్ కూడా పాష్ ఎట్ మాస్మియర్ ఉండడంతో.. బి,సి సెంటర్స్ లో ఎంతవరకూ ఫేర్ చేస్తుందో చూడాలి. అఖిల్ సెకండ్ మూవీగా విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ హలో సినిమా ఫీల్ గుడ్ అండ్ క్యూట్ లవ్ స్టోరీగా 2017 కు మంచి ముగింపు ఇచ్చిందని చెప్పవచ్చు.

ప్లస్..
అఖిల్ అప్పియరెన్స్
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్
ఫ్లాట్ స్టోరీలైన్
రొటీన్ స్క్రీన్ ప్లే
తగ్గిన ఎంటర్ టైన్ మెంట్

రేటింగ్..
2.5

Don't Miss