ప్రాక్టికల్‌ పరీక్షలకు అనుమతించలేదని విద్యార్థిని ఆత్మహత్య

16:45 - February 3, 2018

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో ఆర్ట్స్ ఆండ్ సైన్సు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని విజయలక్ష్మి ఆత్మహత్యకి పాల్పడింది. ప్రాక్టికల్‌ పరీక్షలకు ఆలస్యం కావడంతో కాలేజీ యాజమాన్యం అనుమతించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss