తమిళంలో '100% లవ్' ?

10:12 - May 17, 2017

టాలీవుడ్ లో 'నాగ చైతన్య'..'సమంత'లు నటించిన '100% లవ్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమెక్ చేయనున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హీరో జి.వి.ప్రకాష్ కుమార్ ఇందులో హీరోగా నటించనున్నారని టాక్. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే హీరోయిన్ గా 'తమన్నా'నే తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ మాత్రం ఖరారు చేయలేని ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Don't Miss