'పెద్ద నోట్ల రద్దు....సంక్షోభంలో సామాన్యుడు' పై బిగ్ డిబేట్

20:40 - November 26, 2016

'పెద్ద నోట్ల రద్దు....సంక్షోభంలో సామాన్యుడు' అనే అంశంపై టెన్ టివి బిగ్ డిబేట్ నిర్వహించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలోనే లోపం ఉందని వక్తలు అన్నారు. నోట్ల రద్దుతోనే నల్లధనాన్ని అరికట్టవచ్చనే ప్రభుత్వం ఆలోచన అవివేకమన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని.. నల్లకుభేరులు తప్పించుకున్నారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలకు కష్టాలు తప్ప.. అదనంగా ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజా ధనాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు తీసుకున్న నిర్ణయంగానే భావించాలన్నారు. నల్లధనం కుబేరులపై సర్జికలు దాడులు కాదని... ప్రజలు, బ్యాంకులపై ప్రభుత్వం సర్జికల్ దాడులు చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈ డిబేట్ లో బీజేపీ నేత అల్జాపురం శ్రీనివాస్, సీపీఎం కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు, ఆర్థిక రంగ నిపుణులు, వీక్షణం ఎడిటర్ ఎం.వేణుగోపాల్, ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, టీడీపీ నేత పెద్దిరెడ్డి, బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వెంకట్రామయ్య, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ, ఆర్థిక రంగ నిపుణులు పాపారావు పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే...
బీజేపీ నేత అల్జాపురం శ్రీనివాస్... 
'మోడీ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలకు సంక్షోభం... కానీ ప్రజలకు కాదు. ఫిజికల్ ఇబ్బంది ఉంటుంది. 
సీపీఎం కేంద్రకార్యదర్శి వర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు... 
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలోనే లోపం ఉంది. 93శాతం బ్లాక్ మనీ విదేశాల్లో ఉందని మోడీ చెప్పారు. కార్పొరేట్లకు 7 వేల కోట్ల రూపాయలను రద్దు చేశారు. 90 శాతం నల్లధనం రెండు వేల మంది దగ్గర ఉంది. వారి పేర్లు కూడా ప్రభుత్వానికి తెలుసు. కానీ వారిపై దాడులు లేవు. చర్యలు లేవు. నల్లకుబేరులను అరెస్టు చేయలేదు. వారిని రాజరికమార్గంలో పంపారు. జనం డబ్బులు బ్యాంకుల్లో చేరాయి. ప్రజల సొమ్మును మళ్లీ కార్పొరేట్లకు కట్టబట్టేందుకు కుట్ర చేస్తున్నారు. ఇది నాటకం. 4 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జనవరి నుంచి ధరలు తగ్గిస్తారా....? మొత్తం డబ్బులో నల్లధనం 6 శాతమే ఉంది. కార్పొరేట్లకు డబ్బు కట్టబట్టేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఇది ఒక డబ్బు మార్పిడి స్కాం.
వీక్షణం ఎడిటర్ ఎం.వేణుగోపాల్....
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పుడు నిర్ణయం. లిక్విడ్ క్యాష్ రాజకీయ నాయకుల దగ్గరే ఉంటుంది. పెద్ద నోట్లను రద్దు చేసినంత మాత్రాన నల్లధనాన్ని అరికట్టలేరు. 1978లో కూడా నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఇలానే చేశారు. రిలయన్స్, బులియన్, చిట్ ఫండ్, వ్యైద రంగంలో నల్లధనం ఉంది. నల్లధనం ఉన్నవారిపై దాడి చేయకుండా 130 కోట్ల మందిపై దాడి చేశారు. ప్రధాని చెప్పినట్లు ప్రకటిత లక్ష్యాలు వాస్తవం కాదు. నల్లధనాన్ని అరికట్టే కోరిక బీజేపీ ప్రభుత్వానికి  లేదు. క్యాష్ లెస్, భారత ఆర్థిక వ్యవస్థను డిజిటలైజేషన్ చేయాలని జైట్లీ చెప్పారు.  
ఎపిసిసి జనరల్ సెక్రటరీ గిడుగు ముద్రరాజు...
డెసిజన్ తీసుకున్నపరిస్థితిని ఆలోచన చేయాలి. ఇది అవివేకమైన చర్య. 2 వేల రూపాయల నోటు తీసుకురావడం అవివేకం. క్యాష్ లెస్ సొసైటీ వ్యవస్థ చేస్తామనడం హాస్యాస్పదం. చాలా గ్రామాలకు అందుబాటులో బ్యాంకులు లేవు. ఎకానమిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అసంఘటిత రంగం కుదేలైంది.
ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి...
పెద్ద నోట్ల రద్దు..ఆచరణలో ఇబ్బందులు వస్తున్నాయి. సుపరిపాలన రావాలి. క్లిష్టమైన విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలోచన చేయాలి. అనేక గ్రామాలకు అందుబాటులో బ్యాంకులు లేవు.
టీడీపీ నేత పెద్దిరెడ్డి 
అంతు చిక్కని సాహసోపేతమైన నిర్ణయం... కానీ ఇబ్బందులు ఉన్నాయి. 
బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వెంకట్రామయ్య
టీమ్ వర్క్ జరగలేదు. టీమ్ వర్క్ జరిగివుంటే ఇది సాధ్యం కాదని చెప్పేవారు. సామాన్యుడిపై, బ్యాంకులపై సర్జికల్ దాడులు జరిపినట్లు ఉంది.
వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ
డబ్బుల కోసం సామాన్యులు క్యూలో ఉన్నారు. పదిహేను రోజులైనా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిని నల్లధనం వ్యతిరేకులని ప్రధాని అంటున్నారు. పర్యవసానాల్ని ఎందుకు అంచనా వేయలేదు. ఎందుకు ఆర్ బీఐ అంచనా వేయలేకపోయింది. దేశంలో బీజేపీ లేనప్పుడే దేశభక్తి ఉంది. దేశభక్తి గురించి బీజేపీ చెప్పవలసిన అవసరం లేదు. త్యాగాలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పులేదు. కానీ అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి. జీడీపీపై దీన్ని ప్రభావం ఉంటుంది. 
ఆర్థిక రంగ నిపుణులు పాపారావు  
మోడీ నిర్ణయం సరైనది కాదు. నల్లకుబేరులు తప్పించుకున్నారు. ఈ నిర్ణయంపై అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులు ఒత్తడి ఉంది. 90 శాతం మంది అసంఘిత రంగంపై ఆధారపడి ఉన్నారు. వారు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

https://youtu.be/mYIEZy6oqbM

 

Don't Miss