నగదు నరకం..బిగ్ డిబేట్..

21:14 - November 19, 2016

నోట్ల రద్దు దేశాన్ని కుదిపేస్తోంది. భారతదేశం నోట్ల భారతంగా మారిపోయింది. ఈ నిర్ణయం నల్ల కుబేరులను నియంత్రించేందుకేనా? నోట్ల రద్దుతో వారి నిజంగా నిద్ర పట్టటంలేదా? ఈ నిర్ణయంతో నల్లధనం నియంత్రించబడుతుందా? నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న కష్టాలు సమాధానం ఎవరు చెబుతారు? కార్మికుల కండగండ్లు తీర్చేదెవరు? రైతన్నల కష్టాలకు ఎవరు అండగా వుంటారు? ప్రస్తుతం దేశంలో వున్న ప్రధాన సమస్య చిల్లర సమస్య. దేశవ్యాప్తంగా నోట్ల రద్దుపైనే చర్చ నడుస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దుతో పాతనోట్లను కొత్త నోట్లు మార్చుకునే క్రమంలో సామాన్యులు పలు ఇబ్బందులకు..కష్టాలకు గురవుతున్నారు. చిల్లర నోట్లు లభించక దేశవ్యాప్తంగా సామాన్యులు అల్లాడిపోతున్నారు. బ్యాంకుల వద్ద, పోస్టాఫీసుల వద్ద..ఏటీఎంల వద్ద బారులు తీరి గంటల కొద్దీ నిలబడుతున్నారు. అయినా వారి సమస్యలు తీరటంలేదు..కొన్ని ప్రాంతాలలో ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థిలు కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు..ప్రజలు పడుతున్న కష్టాలు.. 11 రోజులు గడిచినా దేశంలో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశంపై నగదు నరకం అనే పేరుతో టెన్ టీవీ బిగ్ డిబేట్ చేపట్టింది. ఈ చర్చలో శ్రీధర్ రెడ్డి (బీజేపీ అధికార ప్రతినిధి), తెలకపల్లి రవి (ప్రముఖ విశ్లేషకులు), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్ టీ.పీసీసీ అధికార ప్రతినిధి), శశి కుమార్ (ప్రముఖ ఎకనమిస్ట్), కర్నె ప్రభాకర్ (టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ),సురేష్ రాయుడు ( టీఐ ఏపీ చాప్టర్ మాజీ ప్రెసిడెంట్) , ఇంకా రైతులు, వివిధ రంగాల నుండి వచ్చిన వ్యక్తులు,వ్యాపారులు, ఉద్యోగులు, ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ మెగా చర్చలో పాల్గొన్నవారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

Don't Miss