కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి
13:23 - March 18, 2017
బెంగళూరు : కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది కూలీలు మృతి చెందారు. ఎలే రాంపుర వద్ద 2 ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు విజయపుర జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి తమ స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పగలడంతో లారీ అదుపుతప్పి ఆటోలను ఢీకొట్టింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.