అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి : తెలంగాణలో 119 బీసీ గురుకులాలు

Submitted on 11 June 2019
119 Gurukulas to function from June 12

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ గురుకులాలు ప్రారంభించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో వీటిని జూన్ 17న సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండేవని, ఐదేళ్లలో ప్రభుత్వం 142 కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు చేసిందని సీఎం వివరించారు.

కొత్తగా 119 మహాత్మాజ్యోతి బాపూలే బీసీ గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటిని కలుపుకుంటే మొత్తం గురుకులాల సంఖ్య 280కి చేరుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని క్యాటగిరీల కింద మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ సంఖ్య 906. అందులో 53 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో 5వేల 335 మంది టీచర్లు ఉన్నారు. 91వేల 680 మంది విద్యార్థులు చదువుతున్నారు.

119 Gurukulas
function
June 12
Telangana
KCR
119 residential schools
backward class students

మరిన్ని వార్తలు