12ఏళ్ల బాలిక క్రియేటివిటి : బుల్లి రోబో.. బట్టలు భలే మడతెట్టేస్తోంది!

Submitted on 11 July 2019
12-Year-Old Nigerian Girl Built A Cheap Robot That Folds Clothes In Three Seconds

నైజేరియాలో పిల్లలంతా కోడింగ్‌తోనే ఆడుకుంటారు. కోడింగ్ తప్ప మరో విద్య తెలియదు. చిన్నప్పటి నుంచే వీరి ఓనమాలు కోడింగ్‌తోనే మొదలువుతుంది. తాము నేర్చుకున్న విద్యతోనే తమ నిత్యవసరాలకు వినియోగించు కుంటున్నారు. సొంతంగా రోబొటిక్ మిషన్లు రూపొందించి వాటి సాయంతోనే పొట్టబోసుకుంటున్నారు. నైజేరియాకు చెందిన ఫాతియా అబ్దుల్లాహికు 12ఏళ్ల వయస్సు. అతి చిన్న వయస్సులోనే కోడింగ్ పై పట్టు సాధించింది.

ఓ బుల్లి చీపెస్ట్ రోబోను రూపొందించింది. ఉతికిన బట్టలను వేగంగా మూడు సెకన్లలో మడతబెట్టేయగలడం ఈ రోబో ప్రత్యేకత. స్వదేశీ డివైజ్ రోబో ప్యానెల్స్ పై వస్త్రాన్ని పెట్టగానే.. ఆటోమాటిక్‌గా డివైజ్ క్లాత్ ను ఫోల్డ్ చేస్తుంది. రోబో తయారీపై ఫాతిమా మాట్లాడుతూ..‘ పిన్స్ ఉపయోగించి EV3 బ్రిక్.. చిన్న రోబోను రూపొందించాను.

EV3 బ్రిక్.. ప్రొగ్రామబుల్ సర్య్కూట్ గా పనిచేస్తుంది’ అని తెలిపింది. LEGO మైండ్ స్ట్రోమ్స్ ఎడ్యుకేషన్ రొబొటిక్స్ గా పిలుస్తారు. ఇందులో రొబిటిక్ కిడ్స్ బేసిక్ ఫంక్షన్లతో ప్రొగ్రామ్ ను బుల్డ్ చేస్తుంటారు. అబ్దుల్లా క్లాత్ ఫోల్డింగ్ రోబోట్.. ఒక ప్రొటోటైప్ లాంటింది. కానీ, రోబో ప్యానెల్ పై పెట్టిన బట్టలను మాత్రమే ఆటోమాటిక్ గా మడతబెట్టగలదు. ఇందుకు రోబో 3 సెకన్లు సమయం తీసుకుంటుంది.

ఈ డివైజ్ ను పూర్తి స్థాయిలో డెవలప్ చేసి.. విక్రయించడం ద్వారా స్థానిక మార్కెట్లో అవసరమైన వారికి ఈజీగా పని వేగవంతంగా పూర్తి అవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. ఈ ఏడాదిలో CES ల్యాండరీ ఫోల్డింగ్ మిషన్ రూపొందించింది. ఈ మిషన్ 5 సెకన్ల సమయం తీసుకుంటుంది. చిన్న లేదా పెద్ద ఐటమ్స్ బేబీ క్లాత్స్, క్లాత్ సీట్లను ఈజీగా మడతపెట్టేస్తోంది. ఈ రోబో తయారీకి వెయ్యి డాలర్ల ఖర్చు అయిందట.

Nigerian Girl
Cheap Robot
Folds Clothes
Fathia Abdullahi
cheap robot


మరిన్ని వార్తలు