గ్యాంగ్ రేప్..ఫిర్యాదు చేసినందుకు హత్య..

21:42 - May 5, 2018

జార్ఖండ్‌ : చత్రా జిల్లా కెందువా గ్రామంలో జరిగిన గ్యాంగ్‌రేప్‌ మర్డర్ ఆలస్యంగా వెలుగుచూసింది. 16 ఏళ్ల మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిపి సజీవ దహనానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటనలో 14 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. మే 3న నలుగురు యువకులు రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలి తండ్రి గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. పంచాయితీ పెట్టిన పెద్దలు 50 వేలు జరిమానా విధించి వంద గుంజీలు తీయాలని నిందితుడిని ఆదేశించారు. పంచాయితీ విధించిన శిక్షపై అవమానంగా భావించిన ప్రధాన నిందితుడు శుక్రవారం రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను చితకబాదాడు. బాధితురాలిపై కిరోసిన్‌ పోసి తగలబెట్టాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. పంచాయితీ పెద్దలను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Don't Miss