స్టీరింగ్‌పై పాకుతూ : మద్యం మత్తులో యజమాని.. కారులో 15 అడుగుల పాము

Submitted on 17 July 2019
15 Foot Snake Slithers Out Of Car After Drunk Owner Passes Out

కారు యజమాని మద్యం సేవించి ఉన్నాడు. ఇదే సరైన సమయం అనుకుందేమో మెల్లగా కారులో నుంచి తప్పించుకోబోయిందో పాము. 15 అడుగుల పొడవు ఉన్న పాము కారు విండోలో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో డెన్వర్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆ పామును పట్టేసుకున్నారు. ఈ ఘటన కొలరాడోలోని డెన్వర్ లో జరిగింది. ఇదో పెంపుడు పాము. తన యజమానితో పాటు బయటకు షికారుకు వెళ్లింది. 

అప్పటికే మద్యం మత్తులో ఉన్న యజమాని కారులో నుంచి హఠాత్తుగా మాయమయ్యాడు. తన యజమాని కనపడకపోయే సరికి కారు లోపల నక్కిన పెంపుడు పాము మెల్లగా బయటకు వచ్చింది. కారు అద్దాల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అది గమనించిన ఫైర్ సిబ్బంది పామును పట్టుకున్నారు. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను డెన్వర్ ఫైర్ డిపార్ట్ మెంట్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి.

‘ఇంజిన్ #29 ఓ వ్యక్తి తన కారులో నుంచి బయటకు వెళ్లాడు. అతడి పెంపుడు పాము.. డ్రైవర్ సైడ్ విండో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది’ అని ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. చివరిలో.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని సూచిస్తూ.. ప్రత్యేకించి కారులో పెంపుడు పాములు ఉండగా మద్యం సేవించవద్దంటూ #బీస్మార్ట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. కారులో 15 అడుగుల పాముకు సంబంధించి ఫొటోలు ఫేస్ బుక్, ట్విట్టర్ లో వైరల్ అవుతుండగా.. టన్నుల కొద్ది కామెంట్లు వస్తున్నాయి. 

15 Foot Snake
Car
Drunk Owner
Passes Out
Denver Fire Department 

మరిన్ని వార్తలు