విహారయాత్రకు వెళ్లివస్తుండగా విషాదం..

10:55 - June 13, 2018

యూపీ : యూపీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లివస్తుండగా విషాదం నెలకొంది. మెయిన్‌పురిలో డివైడర్‌ను ఢీకొట్టి బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. టూర్స్ ఆండ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సులో 45 మందికిపైగా ప్రయాణికులు విహారయాత్రకు వెళ్లారు. రాజస్థాన్ లోని టూరిజం ప్రాంతాలకు వెళ్లివస్తున్నారు. జైపూర్ నుంచి ఫరక్కాబాద్ కు వెళ్తున్నారు. కిరాట్ పూర్ కు ఐదు కిలో మీటర్ల దూరంలో మెయిన్ పురిలో ఉదయం 5 గంటల సమయంలో డివైడర్ ను ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సు అదుపు తప్పి డివైడర్ ను కొట్టి బోల్తా పడినట్లు తెలుస్తోంది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద ఘటన పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మెయిన్ పురి కలెక్టర్, పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని, పరిశీలిస్తున్నారు. ఘటన ఏవిధంగా జరిగిందో రికార్డు చేసుకునేందుకు యూపీ పోలీసులు ఆస్పత్రి వద్ద వెయిట్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులుగా గుర్తించారు. సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు తెలిపే పనిలో పోలీసులు ఉన్నారు. 

Don't Miss