చిన్నారి కిడ్నాప్ సుఖాంతం
13:03 - December 14, 2016
మేడ్చల్ : చిన్నారి కిడ్నాప్ సుఖాంతమైంది. మేడ్చల్ పీఎస్ పరిధిలోని ఉమావెంకట్రామ కాలనీలో 18 నెలల దీక్షిత కిడ్నాప్‌కు గురైంది. నిన్న సాయంత్రం మార్కెట్‌కి వెళతామని పక్కింటివాళ్లు పాపను పట్టుకెళ్లారు. ఇంతవరకూ ఆచూకీ కనిపించకపోవడంతో దీక్షిత తల్లిదండ్రులు శ్రీను, శైలజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో పాప ఉన్నట్లు గుర్తించారు. చిన్నారి కిడ్నాప్ సుఖాంతం అయింది. అందరూ ఊపరిపీల్చుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....