పాము కాటుతో అన్నదమ్ముల మృతి

13:38 - August 20, 2017

వనపర్తి : జిల్లా మధనాపురం మండలంలో విషాదం జరిగింది. పాము కాటుతో ఇద్దరు అన్నాతమ్ముళ్లు మృతి చెందారు. నర్సింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ, ఆశన్నల దంపతులకు హరికృష్ణ, మహేష్‌లు ఇద్దరు సంతానం. తల్లిదండ్రులిద్దరూ పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లగా పిల్లలిద్దరూ నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నారు. పిల్లలిద్దరూ ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో పాము కరిచింది. హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా.. మహేష్‌ను మహబూబ్‌ నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేష్‌ కూడా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకున్నారు. పిల్లలిద్దరూ మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.

Don't Miss