ఆఫ్ఘనిస్తాన్‌లో టీవీ, రేడియో స్టేషన్లపై దాడి

16:32 - May 17, 2017

హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌లో టీవీ, రేడియో స్టేషన్లపై ముగ్గురు ఆగంతకులు దాడికి పాల్పడ్డారు. న‌న్‌గ‌ర్హర్‌ ప్రావిన్సు రాజ‌ధాని జ‌లాలాబాద్‌లో ఉన్న జాతీయ రేడియో స్టేష‌న్‌లోకి ముగ్గురు సాయుధులు చొర‌బ‌డ్డారు. సూసైడ్ మాస్క్‌లు ధ‌రించిన ముగ్గురూ ఏకే-47 రైఫిళ్లతో రేడియో స్టేష‌న్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. ఇద్దరు ఆగంత‌కులు సూసైడ్ బెల్టుల‌ను పేల్చుకున్నట్లు సమాచారం. మ‌రొక‌రు పోరాడున్నాడు. రాష్ట్ర గ‌వ‌ర్నర్ కార్యాల‌యానికి స‌మీపంలో ఉన్న టీవీ స్టేష‌న్‌పై దాడి చేయ‌డంతో అక్కడ ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆగంతకులు టీవీ భవనంలోకి ప్రవేశించారని వారి టార్గెట్‌ ఏంటో ఇంతవరకు తెలియలేదని అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌ సరిహద్దులో ఉన్న నన్‌గర్హర్‌ ప్రావిన్స్‌లో ఐసిస్‌, తాలిబన్ల ప్రభావం తీవ్రంగా ఉంది.

Don't Miss