ముగ్గురి ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం

11:56 - December 1, 2017

జమ్మూకాశ్మీర్ : వివాహేతర సంబంధం మూడు ప్రాణాలను బలిగొన్నది. భార్య తోటి సైనికుడితో సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తుండటంతో తట్టుకోలేక ఓ జవాన్ తుపాకీతో ఇద్దరినీ కాల్చి చంపాడు. అంతటితో ఆగక సదరు సైనికుడి భార్యనూ హతమార్చాడు. జమ్మూ కాశ్మీర్‌లో ఈ సంఘటన జరగగా.. పాల్వంచ మండలం సంగం గ్రామంలో కలకలం సృష్టించింది. సంగం గ్రామానికి చెందిన ఇంజలపు సురేందర్ జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా పని చేస్తున్నాడు ఇతడికి ఏడేళ్ల క్రితం లావణ్యతో వివాహం జరిగింది. మూడు సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్ లో నివాసం ఉంటుంన్నారు. ఈక్రమంలో లావణ్య వేరే జవాన్ తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. సురేందర్ రాత్రి విధులు నుంచి ఇంటికి రాగా..  భార్య సదరు జవాన్ తో సన్నిహితంగా ఉండడం చూసి...  ఆగ్రహోదగ్ధుడై సురేందర్‌.. తన చేతిలో ఉన్న తుపాకీతో లావణ్య,సదరు జవాన్‌ను కాల్చి చంపాడు. తుపాకీ శబ్దంతో పక్క ఇంట్లో ఉన్న జవాన్ భార్య సురేందర్ ఇంటికి వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న భర్తను చూసి హతాశురాలైంది.వెంటనే తేరుకుని సురేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకు నా భర్తను చంపావంటూ నిలదీసింది ఆగ్రహం చల్లారని సురేందర్ ఆమెను కూడా తుపాకీతో కాల్చి చంపాడు. తుపాకీతో నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యాడు.

 

Don't Miss