ఎస్సీ గురుకుల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్...

08:26 - February 16, 2018

ఖమ్మం : ఎస్సీ గురుకుల పాఠశాలలో చేరిపించండి...మంచి చదువు..నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ కొన్ని జిల్లాల్లో అలాంటి పరిస్థితి లేదని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. ఎస్సీ గురుకుల పాఠశాలలోని హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 20 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. భోజనం ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భద్రాచలం కొత్తగూడెం గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి విద్యార్థినిలు భోజనం చేశారు. అనంతరం ఒక్కసారిగా విద్యార్తినిలు కడుపునొప్పి..వాంతులతో బాధ పడుతున్నారు. దీనిని గుర్తించిన హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి భోజనంలో పప్పు..పెరుగు మాత్రమే వాడినట్లు, ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం లేదని హాస్టల్ వార్డెన్ పేర్కొంటున్నారు.

కొంతకాలంగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నా అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై గతంలో ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, దీని కారణంగా అనారోగ్యాలకు గురవుతున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. దీనిని హాస్టల్ యాజమాన్యం కొట్టిపారేస్తుంది. తాజా జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Don't Miss