రయ్..రయ్..రయ్ : సుజుకీ జిక్సర్ 155 వచ్చేసింది

Submitted on 12 July 2019
2019 Suzuki Gixxer Launched In India; Priced At ₹ 1 Lakh

ఆటోమొబైల్‌ దిగ్గజం సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ సరికొత్త 2019 సుజుకీ జిక్సర్‌ 155 బైక్ ని భారతీయ మార్కెట్లో ఇవాళ(జులై-12,2019) లాంచ్ చేసింది. దీని ధర 1లక్ష రూపాయలు(ఎక్స్‌- షోరూం ఢిల్లీ)గా ఉంది. 155సీసీ ఫోర్‌ స్ట్రోక్‌ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌, ఫ్యూయల్ ఇంజెక్టెడ్‌ ఇంజిన్‌, 8000 ఆర్‌పీఎం దగ్గర 14 ఎన్‌ఎం టార్క్‌, 13.9 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 
5-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, సింగిల్‌ చానెల్ యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మెటాలిక్‌ సోనిక్‌ సిల్వర్‌ &‌ గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌, గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌, మెటాలిక్‌ ట్రైటన్‌ బ్లూ, గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ లాంటి మూడు రంగుల్లో ఈ మోడల్‌ అందుబాటులో ఉన్నట్లు సుజుకీ ప్రకటించింది. మోటార్‌ సైక్లింగ్‌ అభిమానులకు అద్భుతమైన రైడింగ్‌ అనుభూతిని ఈ మోడల్‌ అందిస్తుందని సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు దెవాశిష్‌ తెలిపారు.

భారత్‌లో ప్రీమియం స్పోర్ట్స్‌ మోటార్‌ సైకిల్స్‌పై ప్రజాదరణ పెరుగుతున్న సమయంలో దూకుడు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, శక్తిమంతమైన పనితీరుతో సరికొత్త సుజుకీ జిక్సర్‌ ని భారత మార్కెట్లో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

SUZUKI
launched
Delhi
india
1LAKH
price
2019 SUZUKI GIXXER


మరిన్ని వార్తలు