యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

09:24 - June 5, 2017

లక్నో : యూపీలోని బరేలీ షాజహాన్ పూర్ నేషనల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 1.30 యూపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సును ట్రాక్కు ఢీ కొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులోని డీజిల్ ట్యాంక్ పగలడంతో బస్సులో మంటలు చెలరేగాయి దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది సజీవదహనమయ్యారు. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. దుర్ఘటన తెల్లవారుజామున జరగడంతో బస్సులో అందరు నిద్రపోవడంతో ప్రాణా నష్టం ఎక్కువ జరిగింది. ఈ బస్సు ఢిల్లీ నుంచి యూపీ సెంట్రల్ కు వెళ్తుతోంది. నేషనల్ హైవేపై మరమత్తులు జరుగుతుండంతో బస్సు డ్రైవర్ రాంగ్ రూట్ లో బస్సు నడపడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే మంటలు చెలరేగిన 90 నిమిషాల తర్వాత ఫైర్ ఇంజన్ లు చేరకున్నాయి కానీ అప్పటికే బస్సు మొత్తం కాలిపోయింది. ఈ ఘటన పై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

Don't Miss