హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం : 25 మంది దుర్మరణం

Submitted on 20 June 2019
25 dead at Heavy bus accident in Himachal Pradesh

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కులులో ప్రైవేట్ బస్సు లోయలో పడటంతో 25 మంది దుర్మరణం చెందారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు 300 మీటర్ల లోతున్న లోయలో పడింది. 

50 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఓ ప్రైవేటు బస్సు గురువారం జూన్ 20, 2019 సాయంత్రం కులు దగ్గర లోయలో పడింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కులు జిల్లా బంజర్‌ నుంచి గడగుషనికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సు పైభాగంలో కొందరు ప్రయాణిస్తుండడం ఇందుకు కారణమని తెలుస్తోంది.  

ఘటనా స్థలిలో సహాయక చర్యల కొనసాగుతున్నాయి. అధికారులు ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బస్సు 300 మీటర్ల లోతున్న లోయలో బండరాళ్లున్న ప్రాంతంలో పడడంతో బస్సు నుజ్జునుజ్జయ్యింది.
 

25 dead
Bus
Accident
Himachal pradesh

మరిన్ని వార్తలు