రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

11:44 - January 28, 2018

రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్‌ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై ఇవాళ  ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు కాచిగూడకు చెందిన ప్రవీణ్‌ , మహబూబ్‌నగర్‌కు చెందిన డేవిడ్‌గా పోలీసులు గుర్తించారు. మరో మృతుడు అర్జున్‌ వివరాలు తెలియాల్సి ఉంది. వీరంతా  ఫేస్‌బుక్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన శ్రావణ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  హైదారాబాద్‌ నుంచి వికారాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించారు. చేవెళ్ల  పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Don't Miss