బాలయ్య కోసం కథలు రెడీ చేసుకున్న నలుగురు డైరెక్టర్స్

13:13 - January 11, 2017

బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈ నెల 12రిలీజ్ కానుంది సంగతి తెలిసిందే. దీంతో ఫిల్మ్ సర్కిల్స్ లో బాలయ్య నెక్ట్స్ ఏ దర్శకుడితో కమిట్ అవుతాడనే దానిపై ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తోంది. అయితే ఈ నందమూరి స్టార్ కోసం నలుగురు డైరెక్టర్స్ కథలు రెడీ చేసుకుని క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్న ఆ డైరెక్టర్స్ ఎవరో ఈ స్టోరీ చూడండి.
బాలయ్య న్యూ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర ప్రచారం 
నందమూరి నటసింహాం బాలయ్య న్యూ ప్రాజెక్ట్స్ పై ఫిల్మ్ నగర్ లో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ ఖాయం కావడంతో ఈ సినియర్ స్టార్ నెక్ట్స్ ఎవరి డైరెక్షన్ లో ఎలాంటి మూవీ చేస్తాడని ఫీల్మ్ నగర్ జనాలు ఎవరి వారే ఓ అంచనాకు వస్తున్నారు. కానీ బాలయ్య డిసిషన్స్ ఎప్పుడు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఉంటాయని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిస్తోంది.
దర్శకుల జాబితాలో కృష్ణవంశీ పేరు... 
బాలయ్యతో నెక్ట్స్ మూవీ చేయబోతున్న దర్శకుల జాబితాలో కృష్ణవంశీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ దర్శకుడు నందమూరి హీరో కోసం రైతు అనే స్టోరీని రెడీ చేసి లాక్ చేసినట్లు తెలుసినట్లు సమాచారం. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిన ఈ మూవీ ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యమన్నట్లు వినికిడి. ఆ మధ్య బాలయ్యతో కలిసి కృష్ణవంశీ, అమితాబ్ బచ్చన్ ని కలిసి రైతులో ఓ కీ రోల్ చేయమని రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత వీరి కాంబినేషన్ సంబంధించి అప్ డేట్ లేకపోవడంతో ఈ మూవీ ఆగిపోయినట్లు ప్రచారం సాగుతోంది. మరి ఈ కాంబినేషన్ ఉంటుందా లేదా అనేది బాలయ్య కన్ ఫర్మ్ చేస్తే కానీ తెలియదు. 
ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య999 ప్లాన్ 
బాలకృష్ణ డిసిషన్ కోసం సినియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినియర్ దర్శకుడు బాలయ్యతో ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య999 ప్లాన్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో సెట్స్ పైకి వెళ్లుతుందని భావిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి మోక్షం దొరకడం లేదు. ఇక లేటేస్ట్ గా బాలయ్య అనుమతి కోసం ఎదురుచూస్తున్న దర్శకుల్లో పూరీ జగన్నాథ్ తో పాటు లయన్ మూవీ ఫేం సత్యదేవా కూడా ఉన్నట్లు వినికిడి. ఈ ఇద్దరు దర్శకులు ఆల్ రెడీ బాలయ్యకు స్టోరీ నేరేషన్ చేసినట్లు సమాచారం. మరి ఈ దర్శకుల్లో నందమూరి నటసింహాం అనుగ్రహం ఎవరికి దక్కుతోందో చూడాలి.

Don't Miss