యార్కర్‌ను సిక్సుగా మలిచే 5క్రికెటర్లు

Submitted on 26 May 2019
5 Batsmen who can hit a yorker for a six

బౌలింగ్‌లో ఓ టఫ్ ప్రయోగం యార్కర్. అయితే అది ఎదురుగా ఉన్న బ్యాట్స్‌మన్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్లేయర్లు అంచనా వేయడంలో తడబడి వికెట్ సమర్పించేసుకుంటారు. మరికొందరు మాత్రమే ప్రత్యేక నైపుణ్యం చూపించి యార్కర్‌ను సైతం సిక్సుగా మలిచి బౌలర్‌కు తలనొప్పిగా మారతారు. చాలా తక్కువ మార్జిన్‌లో చాకచక్యంగా స్పందించి సిక్సుగా మలుస్తారు. ఈ ప్రయోగంలో బుమ్రాతో పాటు రబాడ, మిచెల్ స్టార్క్ కూడా బ్యాట్స్‌మెన్ చేతిలో ఓడిపోయారు.  

5. ఆండ్రీ రస్సెల్.. క్రికెట్లోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న దేశీ వాలీ లీగ్ ఐపీఎల్. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2019లో ఆండ్రీ రస్సెల్ బౌలర్లపై విరుచుకుపడి కోల్‌కతాను విజయపథంలో నడిపించాడు. లీగ్ మొత్తానికి 52సిక్సులతో సత్తా చాటాడు. మజిల్ పవర్ వాడి తెలివిగా బ్యాట్‌తో సిక్సులు సునాయాసంగా బాదేశాడు. బౌలర్ వ్యూహాన్ని పసిగట్టి యార్కర్ బంతిని ఒక కాలు ముందుకు పెట్టి బరువును బ్యాలెన్స్ చేసుకుని బ్యాట్‌తో ఫుల్ స్వింగ్ రాబట్టుకుంటాడు. దీంతో పని సులువైపోతుంది. 

4. హార్దిక్ పాండ్యా.. కాఫీ విత్ కరణ్ షో తర్వాత రెట్టింపు వేగంతో దూసుకెళ్తోన్న క్రికెటర్. ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ సిక్సులతో రెచ్చిపోయాడు. ఉన్నవి చిన్నవే అయినా బలమైన కండలతో సిద్ధమయ్యాడు. స్పిన్ బౌలింగ్ లో దిట్టగా భావించిన పాండ్యా బ్యాటింగ్‌తో ఒక్కసారిగా మెరుపుదాడికి దిగుతుండటంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆశ్చర్యానికి గురయ్యాయి. క్రీజులో నిల్చొని యార్కర్లను సునాయాసంగా సిక్సులుగా మలుస్తుంటే స్టేడియంలో కేరింతల మోత మోగుతుంది. 

3. జోస్ బట్లర్.. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాకుండా ఐపీఎల్‌లోనూ బట్లర్ మెరుపులు కురిపిస్తున్నాడు. టైమింగ్‌తో పాటు పవర్ జోడించి బౌలర్లు సంధించే బంతులకు ధీటైన జవాబు ఇవ్వగల దిట్ట కాబట్టే ఇటీవలి కాలంలో మంచి ఫినిషర్‌గా మారాడు బట్లర్. ఈ ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సిక్సులను V షేపులోనే కాదు.. మైదానంలోని 360 డిగ్రీలకు బాల్‌ను సిక్సు బౌండరీకి తరలించగలడు. యార్కర్ అయినా సరే బంతిని వేగంగా అంచనా వేసి ఎదుర్కొనే ప్లేయర్ బట్లర్. 

2. మహేంద్ర సింగ్ ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెటర్లలో కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ప్లేయర్ మహీ. టీమిండియా మాజీ కెప్టెన్ స్కోరుకు అనుగుణంగా ఆడటమే కాకుండా అవసరమైన సమయంలో ఎలాంటి బంతినైనా సిక్సుగా మలచగలడు. మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే ధోనీ కెరీర్‌లో యార్కర్‌ను సిక్సును మలిచిన సందర్భాలు ఎక్కువ. అది తెలిసి కూడా ధోనీ ముందు యార్కర్ ప్రయోగం చేస్తే బీభత్సమే. దానికి ప్రత్యేకంగా హెలికాఫ్టర్ షాట్ అని అభిమానులు పేరు కూడా పెట్టేసుకున్నారు. 

1. ఆస్ట్రేలియాన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్  ఫామ్‌లో ఉంటే ఆపడం ఏ బౌలర్‌కు సాధ్యం కాదు. క్రీజులో నిలదొక్కుకోవడమే కష్టం.. నిలబడ్డాడంటే యార్కర్లను కూడా సిక్సులుగా మలిచి చుక్కలు చూపిస్తాడు. టెక్నిక్ పరంగా చూస్తూ బాది మిడ్ వికెట్ మీదుగా, బౌలర్ తలపై నుంచి కూడా బౌండరీకి పంపిన షాట్‌లు చాలానే ఉన్నాయి. రివర్స్ స్వీప్ బాదడంలోనూ మ్యాక్స్‌వెల్ సూపర్. 

mahendra singh dhoni
Hardik Pandya
cricket
yorker

మరిన్ని వార్తలు