చింతమనేనికి జైలు..బెయిల్ కోసం ప్రయత్నాలు...

13:10 - February 14, 2018

పశ్చిమగోదావరి : ఏడేళ్ల పాటు కేసు నడించింది..చివరకు కోర్టు అతనికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆయనో ఎవరో కాదు..పలు వివాదాలకు కారణమైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ 2011లో దెందులూరులో జరిగిన జన్మభూమి సభలో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ పై చింతమనేని చేయి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. వేదికపైనే చేయి చేసుకోవడంతో కోర్టులో కేసు నమోదైంది. 2011 నుండి ఇప్పటి వరకు కేసు నడుస్తోంది.

కోర్టు ఎదుట బుధవారం హాజరు కావాలని భీమడోలు మెజిస్ట్రేట్ ఆదేశించింది. కానీ వట్టి వసంత కుమార్ కోర్టుకు హాజరు కాగా చింతమనేని గైర్హాజయ్యారు. అనంతరం కోర్టు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష...రూ. 3,000 జరిమాన విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Don't Miss