పెహ్లూ ఖాన్ కేసులో... నిందితులందరూ నిర్దోషులే

Submitted on 14 August 2019
6 Accused In 2017 Mob Killing Of Pehlu Khan Acquitted By Rajasthan Court

పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడనే కారణంతో 2017 ఏప్రిల్‌ 1న పెహ్లూ ఖాన్‌ (55) అనే హర్యాణాకు చెందిన వ్యక్తిని జైపూర్-ఢిల్లీ హైవేపై ఓ మూక నిర్దాక్షిణ్యంగా చావ బాదింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌ ప్రాంతంలో జరిగింది. తీవ్ర గాయాలతో  హాస్పిటల్ లో చేరిన హెహ్లూ ఖాన్‌ చనిపోయాడు. ఈ  కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కేసులో సరైన ఆధారాలు లేనందున కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించినట్లు లాయర్ హేమ్‌చంద్‌ శర్మ తెలిపారు.

ఓ వీడియోలో ఆరుగురు నిందితులు పెహ్లూ ఖాన్‌ను రోడ్డుపై ఈడ్చుకొని వెళ్తున్న దృశ్యాలు ఉన్నా.. అవి స్పష్టంగా లేవని, ఆ ఆధారం చెల్లదని కోర్టు తేల్చింది. అంతేకాక హెహ్లూఖాన్‌ చనిపోయిన తీరులోనూ సందేహాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. హాస్పిటల్ డాక్టర్లు  ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పగా, గాయాల వల్ల మరణించినట్లు పోస్టు మార్టం నివేదిక తేల్చిందని తెలిపింది.

ఈ కేసులో మొత్తం నిందితులు 9మంది కాగా వీరిలో ముగ్గురు మైనర్లు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీరిపై జువైనల్‌ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ ఆరుగురు నిందితులపై రాజస్థాన్‌ పోలీసులు విచారణ జరిపి వీరికి క్లీన్‌ చిట్ ఇచ్చారు. దీంతో వారు 2017 సెప్టెంబరు నుంచి బెయిల్‌పైనే ఉన్నారు. పెహ్లూ ఖాన్‌, ఆయన కుమారులు ఆవులను అక్రమ రవాణా చేశారని పేర్కొంటూ ఈ ఏడాది జూన్‌లో రాజస్థాన్‌ పోలీసులు ఓ చార్జిషీటు దాఖలు చేశారు. ఇది రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే.

6 Accused
Mob Killing
Pehlu Khan
acquitted
Rajasthan Court
Cattele transporting

మరిన్ని వార్తలు