దుబాయ్‌ రోడ్డు ప్రమాదంలో 17మంది మృతి..8మంది భారతీయులే

Submitted on 7 June 2019
8 Indians among 17 killed in Dubai road accident

దుబాయి లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17మంది మృతి చెందారు. వారిలో 8మంది భారీతీయులు ఉన్నారు. ఈ విషయాన్ని దుబాయ్ లోని భారతీయ రాయబార కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ ప్రమాదానికి కారణం అతి వేగమనే తెలుస్తోంది. కాగా 31 మంది ప్రయాణికులతో ఒమన్‌ నుంచి దుబాయికి వస్తుండగా..షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.  

అతివేగంతో ట్రాఫిక్‌ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టి బస్సు బోల్తాపడింది. మృతుల్లో భారత్‌కు చెందిన రాజగోపాలన్‌, ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, రేష్మ ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, దీపక్‌ కుమార్‌, జమాలుద్దీన్‌ అరక్కవీటిల్‌, కిరన్‌ జానీ, వాసుదేవ్‌, తిలక్‌రామ్‌ జవహార్‌ ఠాకూర్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు కాన్సులేట్‌ అధికారులు తెలిపారు.

8 Indians
17 killed
Dubai
road accident

మరిన్ని వార్తలు