ఆమె కాళ్లు చూపించిందా : 9నెలల చిన్నారి హత్యాచారం ఘటనపై నటి రష్మి ఆవేదన

Submitted on 20 June 2019
9 months old baby rape murder case, anchor rashmi gautam reaction

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 9 నెలల పసికందు హత్యాచారం ఘటనపై జబర్దస్త్ యాంకర్, నటి రష్మి గౌతమ్ తీవ్రంగా స్పందించారు. తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ‘ఏం చేసిందని 9 నెలల పాపపై విధి కక్షగట్టింది.. ఆమె బట్టలు అసభ్యకరంగా ఏమైనా వేసుకుందా.. ఆమె క్లీవేజ్ షో ఏమైనా చేసిందా.. ఆమె తన కాళ్లను ఏమైనా చూపించిందా.. ఆమె తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పిందా.. ఏం చేసింది ఆమె????’ అని రష్మి తన ట్వీట్‌లో వాపోయారు. 9 నెలల పసికందుపై జరిగిన క్రూరమైన చర్యను రష్మి ఖండించారు.

అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రిస్తున్న 9 నెలల పసికందుని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన కలకలం రేపింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఈ దారుణం జరిగింది. ఇంతటి ఘోరానికి తెగబడిన ప్రవీన్ ని నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ ప్రాంతంలో జగన్, రచన దంపతులు నివసిస్తున్నారు. రచన గతేడాది ఆడబిడ్డకు జన్మనివ్వగా శ్రిత అని పేరు పెట్టారు. పాప వయసు 9 నెలలు. ఇంట్లో ఉక్కపోతగా ఉండటంతో ఆ దంపతులు మంగళవారం రాత్రి డాబాపై నిద్రించారు. ఈ విషయాన్ని గమనించిన ప్రవీణ్ అనే యువకుడు అర్ధరాత్రి వేళ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఏడుస్తుండటంతో చంపేశాడు.

చిన్నారి పక్కన లేకపోవడంతో కంగారుపడిన జగన్, రచన చుట్టపక్కల వెతికారు. ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో ప్రవీణ్ పాపతో కనిపించాడు. పాప విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. వెంటనే పాపని ఆస్పత్రికి తరలించారు. అయితే పాప అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రవీణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ అమానవీయమైన ఘటన పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రవీణ్ ని ఉరి తియ్యాలని డిమాండ్లు వస్తున్నాయి.

పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నారు. నిందితుడు ప్రవీణ్ కి నిర్బయ తరహా శిక్ష పడేలా విచారణ వేగవంతం చేశామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మానవ మృగాలకు కనువిప్పు కలిగేలా ఈ కేసుని ఛాలెంజ్ గా తీసకున్నామన్నారు. కోర్టులో కూడా విచారణ వేగంగా పూర్తయ్యేలా  ప్రయత్నిస్తామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యే విధంగా చూస్తామని పోలీసులు తెలిపారు.

9 months old baby
Rape
murder
rashmi gautami
warangal
Hanmakonda
Tweet

మరిన్ని వార్తలు