యూపీలో కిరాతకం : ల్యాండ్ డీల్‌లో కాల్పులు.. 9 మంది మృతి

Submitted on 17 July 2019
9 shot dead in land dispute in Sonebhadra in Uttar Pradesh

అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోమభద్ర జిల్లా. ఉబ గ్రామం. జులై 17వ తేదీ బుధవారం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. గ్రామంలో రక్తం ఏరులైపారింది. ఊహించని ఘటనతో గ్రామస్తులు పరుగులు తీశారు. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. బుల్లెట్లకు 9 మంది చనిపోతే.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. దీనికి కారణం ఆ గ్రామ పెద్ద కారణం. అతని అహంకారానికి బలైంది సామాన్యులు.

భూమి విషయంలో వివాదం : 
ఉబ గ్రామానికి పెద్దగా వ్యవహరించే అతను.. రెండేళ్ల క్రితం 90 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఈ రోజు ఆ ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవటానికి వచ్చాడు. దీన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అడ్డుకున్నారు. అంటే కోపంతో ఊగిపోయిన గ్రామపెద్ద, అతని అనుచరులు ఈ దురాగతానికి పాల్పడ్డారు.

గ్రామ పెద్ద అనుచరులు తుపాకులతో ఇష్టానుసారం కాల్పులు జరిపారు. స్పాట్ లోనే తొమ్మిది మంది చనిపోయారు. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికికానీ విషయం ప్రపంచానికి తెలియరాలేదు. వెంటనే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగారు. గ్రామానికి అదనపు బలగాలను తరలించారు.

విచారణకు సీఎం యోగీ ఆదేశం :
ఉబ గ్రామంలో జరిగిన ఊచకోతపై సీఎం యోగీ సీరియస్ అయ్యారు. వెంటనే స్పాట్ కు వెళ్లాలని డీజీపీని ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాల్పులు జరిపిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గ్రామ పెద్ద ఇంకా పరారీలోనే ఉన్నాడు. కేవలం 90 గుంటల భూమి విషయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా జరుగుతున్న ఈ వివాదం ఇంత దారుణానికి కారణం అవుతుందని ఆ గ్రామస్తులు కూడా ఊహించలేదు. 

Uttar Pradesh
Sonebhadra 9 shot dead
gun
fire
land dispute

మరిన్ని వార్తలు