900 సంవత్సరాల కరవు.. వేల ఏళ్ల 'ఘన చరిత్ర'ను తుడిచిపెట్టేసిందా?!!..

15:53 - April 16, 2018

మానవ మేథస్సు ఎంత పదును పెడితే అంత చరిత్ర వెల్లడవుతుంది అనటానికి ఓ ఉదాహరణ ఇప్పుడు కనిపిస్తోంది. మనిషి సృష్టించిన చరిత్రను తృటిలో తుడిచిపెట్టివేసే శక్తి ప్రకృతికి మాత్రమే వుంది. ప్రకృతి చేసిన కరాళ నృత్యానికి ఎంతటి ఘనత కలిగిన చరిత్ర అయినా కూలిపోవాల్సిందే. భూస్థాపితం కావాల్సిందే. కానీ చరిత్రను తవ్వి వాస్తవాలను విశదీకరించే మేధస్సు మాత్రం మనిషికి వుంది. అలా ప్రకృతి చేసిన కరాళ నృత్యానికి భూస్థాపితం అయిపోయిన 'ఘన(త)చరిత్ర'ను మనిషి తన తెలివితేటలతో వెలికితీశాడు. ప్రకృతిని మనిషి శాసించలేకపోయినా..అది చేసే విలయానికి ప్రాణ, ఆస్తి నష్టాలను ఎక్కువ కాకుండా నియంత్రించుకోగలుగుతున్నాడు. కానీ అది అన్ని సమయాలలోను, అన్ని ప్రాంతాలలోను, అన్ని కాలాలలోను సాధ్యం కాకపోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే అంటున్నారు ఖరగ్ పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు.

భారతదేశ చరిత్రను, పురావస్తు శాస్త్రగతిని మార్చివేసిన ఘటన..
ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా 4,350 సంవత్సరాల క్రితం భాసిల్లిన సింధునాగరికత అంతరించిపోవడానికి గల కారణం ఇప్పటి వరకూ రహస్యంగా వుండిపోయింది. క్రీ.శ 1921లో జరిగిన ఒక సంఘటన భారతదేశ చరిత్రనే కాకుండా పురావస్తు శాస్త్ర గతిని కూడా మార్చివేసింది. రాయ్ బహద్దూర్ దయారాం సహాని 1921లో ప్రసిద్ధి చెందిన 'హరప్పా నగరాన్ని' సింధు నదికి ఉపనది అయిన 'రావి' నది ఒడ్డున వుందని కనుక్కున్నాడు. 1922లో ఆర్ .డి.బెనర్జి సింధునది కుడిపక్కన ఒడ్డున ఉన్న మెహంజోదారోను కనుక్కున్నాడు.

సింధు నాగరికతకు వివిధ రకాల పేర్ల ప్రతిపాదన..
సింధు నాగరికతకు పురావస్తు శాస్త్రజ్నులు వివిధ రకాల పేర్ల ప్రతిపాదించారు. క్రీ.పూర్వం సుమేరియా నాగరికతతో హరప్పా నాగరికతకు వున్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా దీన్ని మొదట ఇండో సుమేరియా నాగరికతగా పిలిచేవారు. ఇది సింధు నది లోయలో అభివృద్ధి చెందటం వల్ల దీన్ని సింధు నాగరికత అని కూడా అన్నారు. సర్ జాన్ మార్షల్ దీన్ని హరాప్పా నాగరికతగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఏ ప్రదేశంలోనైనా ఒక నాగరికతను మొదట కనుక్కుంటారో ఆ నాగరికతను ఆ పేరు పెట్టటం పురావస్తు శాస్త్ర పంప్రదాయం. అలాగే సింధు లోను ప్రాంతంలో అంటే హక్ర ఘగ్గర్ నదీ ప్రాంతంలో కనుక్కోవటం వల్ల దీన్ని సింధు నాగరికతగా నామకరణం చేయబడింది.

పలు నాగరికతలకు తీసిపోయిన నాగరికత సింధు, హరప్పా.
కాగా వేద సాహిత్యం ప్రకారం క్రీ.పూర్వం భారతదేశ చరిత్ర వున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. అయితే మొహంజోదారో, హరస్పా, చాన్హుదారో, ఇతర సింధు లోయ ప్రాంతాల్లో జరిపిని తవ్వకాల ఆధారంగా క్రీ.పూర్వం శతాబ్ధాల క్రితం సమాధి అయిపోయిన చరిత్ర వెలుగులోకి వచ్చింది. సేమేరియా, అక్కడ్,బాబిలోనియా, ఈజిస్టు, అస్సీరియా వంటి గొప్ప ప్రాచీన నాగరికతలకు ఏమాత్రం తీసిపోని నాగరికత హరప్పా ప్రాంతంలో ఉన్నట్లుగా పరిశోధకులు నిర్ధారించారు.

గుర్తించిన ఖరగ్ పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు..
ఐఐటీ ఖరగ్‌ పూర్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుదీర్ఘంగా వేధించిన కరవు కారణంగా సింధు నాగరికత అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. 4,350 సంవత్సరాల క్రితం రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కరవు ప్రారంభమైందని. కొన్నేళ్ల తరువాత అది తీవ్రరూపం దాల్చి సుమారు 900 సంవత్సరాలు కొనసాగిందని ఐఐటీ ఖరగ్ పూర్ భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

ఆధారాలు ఉన్నాయి : శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ కుమార్‌ గుప్తా..
దీంతో అక్కడి ప్రజలు గంగా, యమునా లోయగుండా ప్రయాణిస్తూ, ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు బెంగాల్, దక్షిణ వింధ్యాచల్, దక్షిణ గుజరాత్ లలోని మైదాన ప్రాంతాలకు చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల 5 వేల ఏళ్ల క్రితం వాయువ్య హియాలయాల్లో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీని వల్ల నదులు ఎండిపోయే పరిస్థితి వచ్చి. అది తీవ్రమైన కరవుకు దారితీసిందని అన్నారు. దీంతో సిరిసంపదలతో విలసిల్లిన సింధునాగరికత ప్రాభవం కోల్పోయిందని తెలిపారు. దీనికి ఆధారంగా లడఖ్‌ లోని మోరిరి సరస్సుకు సంబంధించిన 5 వేల సంవత్సరాల రుతుపవన, శీతోష్ణస్థితి మార్పుల పట్టికను జతచేశారు.

సింధు నాగరికత, హరప్పా నాగరికత, ఖరగ్ పూర్, ఐఐటీ, శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ కుమార్‌ గుప్తా,

Don't Miss