959 దేశముదుర్లు : ఒకే సమాధానం.. ఒకే తప్పులు.. ఒకే టైటిల్.. ఆన్సర్లు అచ్చుగుద్దారు

Submitted on 17 July 2019
959 students, same answers, same mistakes in Gujarat State Board Exams

ఎవడైనా స్టూడెంట్ ఎక్కువ చేస్తుంటే దేశ ముదురు అంటాం.. అలాంటిది 959 మంది దేశముదుర్లు ఒకే చోట కనిపిస్తే.. ఒకే పని చేస్తే.. సేమ్ టూ సేమ్ కాపీ కొట్టేస్తే ఎలా ఉంటుందో చూపించారు గుజరాత్ స్టూడెంట్స్. గుజరాత్ స్టేట్ లో ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగాయి. ఇప్పుడు ఆన్సర్ పేపర్లను దిద్దుతున్నారు. టీచర్లు మాత్రం షాక్ అయ్యారు. ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా 959 మంది స్టూడెంట్స్ సేమ్ టూ సేమ్ అంట.. ఆ 959 దేశముదుర్ల కథ ఏంటో తెలుసుకుందాం..

గుజరాత్ రాష్ట్రం సోమనాథ్ జిల్లా. సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షకు హాజరైన 959 స్టూడెంట్స్.. ఒకే సమాధానం రాశారు. ఆన్సర్ ఒకటే అయితే ఒకేలా ఉంటుంది అనుకోవచ్చు.. తప్పులు కూడా ఒకేలా ఉన్నాయి.. ఏముందిలే అనుకున్నా.. సబ్ టైటిల్స్ కూడా ఒకేలా ఉన్నాయి. ఈ పిల్లలు అందరూ సేమ్ టూ సేమ్.. జిరాక్స్ అన్నట్లు ఆన్సర్లు అచ్చుగుద్దేశారు. పరీక్ష పేపర్లు దిద్దుతున్న టీచర్లు షాక్ అయ్యారు.

దీనిపై విచారణ చేపట్టింది బోర్డు. మాస్ కాపీయింగ్ జరిగినట్లు గుర్తించారు. గుంపులు కూర్చుని పరీక్షలు రాశారంట. ఒక ఆన్సర్ షీట్ ను జిరాక్స్ తీసి అందరికీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో అందరూ అచ్చు గుద్దేశారు. దీంతో తప్పులు కూడా యథావిధిగానే వచ్చేశాయి. దీంతో 959 మంది స్టూడెంట్స్ మొత్తాన్ని ఫెయిల్ చేశారు. ఏడాది పాటు మళ్లీ పరీక్షలు రాయకుండా నిషేధించారు. జనరల్ స్టడీస్ లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మిగతా సబ్జెక్టుల్లో కూడా ఫెయిల్ అయినట్లు ప్రకటించారు బోర్డు అధికారులు. గుజరాత్ రాష్ట్ర చరిత్రలో ఇలా జరగటం ఇదే మొదటిసారి.

959 students
same answers
same mistakes
Gujarat
Board Exams

మరిన్ని వార్తలు