OMG : హైదరాబాద్ లో 9వేల కిలోల వెండి పట్టివేత

Submitted on 10 June 2019
9K Kg Silver caught police in Hyderabad city

అది ఓ కంటైనర్. అందులో ఏదో సరుకు తరలిస్తున్నారు అనుకుంటే పొరపాటే.. ఈ కంటైనర్ నిండుగా ఉన్నది ఏంటో తెలుసా.. వెండి. అవును.. అది మొత్తం 9వేల కిలోలు ఉంది. దీని విలువ అక్షరాల 35 కోట్ల రూపాయలు. ఇంత వెండి పోలీసుల తనిఖీలో దొరికింది. హైదరాబాద్ సిటీలోని సికింద్రాబాద్ బోయినపల్లిలో పట్టుకున్నారు పోలీసులు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Also Read : ఆ ఆరుగురు దోషులు : కథువా చిన్నారి రేప్, మర్డర్ కేసులో కోర్టు తీర్పు

లండన్ నుంచి హైదరాబాద్ :
9వేల కిలోల వెండి లండన్ నుంచి చైన్నైకి వచ్చిందని.. అక్కడి నుంచి కంటైనర్ గా హైదరాబాద్ తీసుకువచ్చినట్లు ప్రాథమిక సమాచారం. ఇన్ని వేల కిలోల వెండి తరలింపు వెనక కారణం ఏంటీ.. ఎందుకు ఇంత హైదరాబాద్ తీసుకువస్తున్నారు.. దీనికి పత్రాలు అన్నీ సరిగానే ఉన్నాయా లేవా అనే విషయాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇంత పెద్ద మొత్తంలో వెండి దొరకటం కలకలం రేపుతోంది.

హైదరాబాద్ లో అమ్మకం కోసం వ్యాపారులు తీసుకువస్తున్నారా లేక ఇంకేదైనా కంపెనీ వారు కొనుగోలు చేశారా అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కంటైనర్ పోలీసుల అదుపులో ఉంది.
Also Read : కస్టమర్ కు కట్టండి : సోనీ టీవీ కంపెనీకి రూ.3లక్షల జరిమానా

9K Kg
silver
Caught
Police
Hyderabad

మరిన్ని వార్తలు