ఆకతాయిల వేధింపులతో బాలిక ఆత్మహత్యాయత్నం

15:44 - November 12, 2017

పశ్చిమగోదావరి : ఆకతాయిల వేధింపులు తాళలేక తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఘన్‌ బజారుకు చెందిన షేక్‌ ఖాజా బాను అనే మైనర్‌ బాలిక సీఎస్సీ అలెక్జాండర్ స్కూళ్లో తొమ్మిదవ తరగతి చదువుతోంది. అయితే నిన్న రాత్రి 7 గంటలకు షాపుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రాకేష్‌, సురేష్‌, విజయ్‌ అనే ముగ్గురు యువకులు వెంటబడి, వేధిస్తూ కత్తితో దాడి చేశారని ఆరోపిస్తున్నారు ఖాజా బాను తండ్రి. బాలిక వద్ద నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. దాడిలో పాల్పడిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

 

Don't Miss