అవినీతి లేదా ? సిక్కోలులో లంచగొండి...

11:24 - June 11, 2018

శ్రీకాకుళం : ఏపీ రాష్ట్రంలో అవినీతి జరగడం లేదని..ఎక్కడ అవినీతి ఉందో చూపెట్టాలని పాలకులు సవాల్ విసురుతున్నారు. అధికారులు లంచాలకు మరిగి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. వీరి భరతం పడుతున్న ఏసీబీ మరో లంచగొండిని పట్టుకుంది. సిక్కోలు నగర కార్పొరేషన్ డీఈఈ శ్రీనివాసరాజు నివాసం..కార్యాలయంపై సోమవారం ఉదయం దాడులకు దిగింది. ఏలూరు, భీమవరం, నిడదవోలు, విశాఖపట్టణం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో కోటిన్నరకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించినట్లు సమాచారం. అవినీతికి పాల్పడుతూ భారీగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు ఏసీబీకి విశ్వసనీయ సమాచారం అందినట్లు, ఈ నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. 

Don't Miss