ఏపీలో ఏసీబీ దాడుల కలకలం

09:44 - January 9, 2017

అమరావతి : చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.. నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాలెం చెక్‌పోస్ట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు... అక్రమంగా డబ్బు వసూలుచేస్తున్న ముగ్గురు ప్రైవేట్‌ వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.. వారి దగ్గరనుంచి 58 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు... వాణిజ్య పన్నుల సిబ్బందిపేరుతో నిందితులు డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. అలాగే అనంతపురం జిల్లా హిందూపురం కొడికొండ చెక్‌పోస్ట్‌పైకూడా ఏసీబీ దాడులు చేసింది.. ఓ ప్రైవేట్‌ వ్యక్తినుంచి 15వేల రూపాయల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. చిత్తురు జిల్లా పలమనేరులోని కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసులోనూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.. 35వేల రూపాయల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు..

Don't Miss