దినకరన్ వర్గానికి షాక్...

15:51 - June 14, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్ర హైకోర్టు విభిన్నమైన తీర్పు వెలువరించింది. ఇద్దరితో కూడిన ధర్మాసనం ఒకరికి భిన్నంగా మరొకరు తీర్పులు వెలువరించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదంతా శాసనసభ్యుల అనర్హత కేసులో నెలకొంది. అన్నాడీఎంకే అసమ్మతి వర్గ నేత దినకరన్ వర్గానికి చెందిన 18 మంది శాసనసభ్యుల అనర్హత కేసులో గురువారం హైకోర్టు తీర్పును వెలువరించింది. ముఖ్య మంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించిన 18 మంది ఎమ్మెల్యేలను స్పీకర్‌ ధన్‌పాల్‌ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించడం...ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 18 మంది సభ్యులు హై కోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్ లతో కూడిన ధర్మాసనం వెలువరించింది. స్పీకర్ నిర్ణయాన్ని సుందర్ వ్యతిరేకంగా ప్రధాన న్యాయమూర్తి ఇందిరా సమర్థించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Don't Miss