విజయవాడ..గుంటూరు..నెల్లూరులో బంద్...

10:56 - April 16, 2018

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపరచాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. సోమవారం ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుండే నేతలు పలు బస్టాండుల ఎదుట బైఠాయించడంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. దీనితో ప్రజా రవాణా స్తంభించి పోయింది.

గుంటూరు లో ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. నేతలు వినూత్నంగా నిరసనలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణ్ రావు టెన్ టివితో మాట్లాడారు. బీజేపీ ఎంత మోసం చేసిందో టిడిపి కూడా అంతే మోసం చేసిందన్నారు. బాబు చేపట్టే దీక్ష ఒక నాటకంగా అభివర్ణించారు.

నెల్లూరు : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. కావలి, గూడురు, వెంకటగిరి, ఇతర ప్రాంతాల్లో ఉదయం నుండే బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కావలి బస్టాండు వద్ద వామపక్ష నేతలు బైఠాయించారు. బస్సులను అడ్డుకోవడంతో ప్రజా రవాణా స్తంభించింది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండు వద్ద నేతలు ధర్నా నిర్వహించారు. 

Don't Miss