వామపక్షాల బంద్ కు సంపూర్ణ మద్దతు

10:13 - February 8, 2018

తూర్పుగోదావరి : బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్‌ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే అన్ని వర్గాలు స్వచ్చందంగా బంద్‌ పాటిస్తున్నాయి. కాకినాడలో బంద్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం... 
పశ్చిమగోదావరి  
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బంద్‌లో పాల్గొన్న వామపక్ష నేతలతో పాటు వైసీపీ, కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా బంద్‌కు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. 8 డిపోల్లో 450 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 
గుంటూరు
కేంద్ర ప్రభుత్వ తీరు, చంద్రబాబు ప్రభుత్వ చేతగాని తనంపై లెఫ్ట్‌పార్టీలు కన్నెర్రజేశాయి. బడ్జెట్‌లో ఏపీకి అరకొర కేటాయింపులపై నిరసనకు దిగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా కేంద్రం మెలికలు పెడుతోందని.. కమ్యూనిస్ట్‌పార్టీలు మండి పడుతున్నాయి. మిత్రపక్షంగా ఉన్నా.. టీడీపీ మోదీ స్కార్‌ నుంచి నిధులు రాబట్టడంలో విఫలం అయిందని లెఫ్ట్‌పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసరగా ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చాయి. అయితే గత అర్ధరాత్రి నుంచే ఎక్కడి కక్కడ వామపక్షాల నేతలను ముందుస్తుగా అరెస్టు చేస్తున్నారు.  మరో వైపు వామపక్షాల బంద్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ , వైసీపీ అధ్యక్షడు జగన్‌ మద్దతు తెలిపారు. బంద్‌ సందర్భంగా ఇవాళ జగన్‌ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్‌డిపోల ముందుకు వామపక్షాల కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. బస్సులను కదల కుండా డిపోల ముందు ధర్నాకు దిగుతున్నారు. 

 

Don't Miss