ఓ మహిళను ఎదుర్కొనలేరా -చెవిరెడ్డి..

08:17 - March 16, 2017

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం కొనసాగనున్నాయి. ఈ రోజు అసెంబ్లీ హాట్ హాట్ జరగనుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. ఓ మహిళ అనుచితంగా ప్రవర్తించారంటే అందుకు గల కారణాలు చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రోజా మూడు సార్లు దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందని, తనపై ఎమ్మెల్యే అనిత ఎలా దురుసుగా మాట్లాడారో చూపెట్టాలని కోరడం జరిగిందన్నారు. శాసనసభ్యులకు కులం అంటూ ఏదీ ఉండదని ఇందుకు ఎమ్మెల్యే రోజా వివాహమే నిదర్శనమన్నారు. ఒక మహిళను ఎదుర్కొనే దీనస్థితిలో టిడిపి ప్రభుత్వం ఉందని విమర్శించారు.
ఈ రోజు గవర్నర్ ప్రసంగంపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పనున్నారు. సభ ఎదుట నాలుగు బిల్లులు రానున్నాయి. పర్యాటక – సాంస్కృతిక, వారసత్వ చట్టం, ఎక్సైజ్ బిల్లు, వ్యాట్ బిల్లులు ఇందులో ఉన్నాయి. ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులపై చర్చ జరగనుంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల కమిటీ నివేదిక సమర్పించనుంది.

Don't Miss