సాక్షి పనికిమాలిన పేపర్ : సీఎం చంద్రబాబు

16:50 - January 7, 2018

కర్నూలు : సాక్షి... ఓ పనికిమాలిన పేపర్ అని సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నిర్వహించిన 'జన్మభూమి మా ఊరు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పబ్లిసిటీ మానేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పంటలను కొనడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. పద్ధతి ప్రకారం వెళ్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అధికార యంత్రాంగాన్ని మీ గ్రామానికి పంపించామని తెలిపారు. పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని తెలిపారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. హైదరాబాద్ ను తానే డెవలప్ చేశానని తెలిపారు. హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. బెంగుళూరు వల్ల కర్నాటకకు ఆదాయం వస్తుందన్నారు. అలాంటి నగరాలు మనకు లేవని తెలిపారు. అన్నీ ఇండ్లకు కరెంటు, వంట గ్యాస్ ఇచ్చామని పేర్కొన్నారు. మార్చి లోపు అన్ని ఇళ్లళ్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. అర్ధకోటి పించన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని కొనియాడారు. ఎవరైనా సహజ మరణం చెందితే చంద్రన్న పథకం కింద ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నామని చెప్పారు. 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ జెండర్స్ కు 1500 పించన్లు ఇచ్చామని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గిస్తామని చెప్పారు. అందరూ సహకరిస్తే అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. సంవత్సరాలుగా అనేక సమస్యలు పేర్కొని ఉన్నాయన్నారు. విశాఖలో 50 వేల ఇళ్ల పట్టాలిచ్చామని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని అన్నారు. అలసత్వం పనికి రాదని అధికారులకు సూచించారు. జవాబుదారి తనాన్ని అలవర్చుకోవాలన్నారు. 

Don't Miss