'పరామర్శించడం కూడా ఒక నేరమా'..

17:43 - January 13, 2018

గుంటూరు : పరామర్శించడం కూడా ఒక నేరమా అని ఏపీ సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. పెదగొట్టిపాడు దళిత కాలనీ సందర్శనకు బయల్దేరిన సీపీఎం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దళితులపై అగ్రకులస్తుల దాడుల నేపథ్యంలో సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు ఆధ్వర్యంలో నేతలను కాలనీ సందర్శనకు బయల్దేరారు. వీరిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
పరామర్శించడానికి వెళుతున్న సీపీఎం నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు ఇతరులను అరెస్టు చేసి తాడికొండ పీఎస్ కు తరలించారు. సుమారు ఐదారు గంటల పాటు స్టేషన్ లో ఉంచి కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. 

Don't Miss