అవినీతి అధికారులకు చెక్‌ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం

07:55 - June 14, 2018

విశాఖ : ప్రభుత్వ ఉద్యోగం వచ్చిదంటే చాలు ఆత్మస్థైర్యంతో జీవించవచ్చు అనుకుంటారు చాలా మంది ఉద్యోగులు. ప్రభుత్వం ఇచ్చే జీతంతో పాటు ఇతరత్రా సంపాదించుకోవచ్చని చాలా మందే భావిస్తుంటారు.  అలాంటి వారి ఆశలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెక్‌పెట్టనుంది. స్పెషల్‌ కోర్ట్‌ యాక్ట్‌ - 2016ను అమల్లోకి తేనుంది. దీంతో ఉద్యోగి అవినీతికి పాల్పడితే... అతని ఆస్తులను జప్తు చేయనుంది ఏసీబీ. ఏడాదిలోనే కోర్టులో విచారణ పూర్తై శిక్ష కూడా పడనుంది.  
అవినీతి అధికారుల కోసం.. స్పెషల్‌ కోర్ట్‌ 2016 యాక్ట్‌ 
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు ఉద్యోగికి తిరుగులేని భరోసా. ప్రభుత్వం ఇచ్చే జీతంతో పాటు మాముళ్లు కూడా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశ్యంతోనే  చాలా మంది ఉద్యోగులు ఉంటారు. అయితే ఇలాంటి వారి ఆశలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  చెక్‌పెట్టనుంది. స్పెషల్‌ కోర్ట్‌ యాక్ట్‌ 2016ను అమల్లోకి తేనుంది. దీంతో ఉద్యోగి అవినీతికి పాల్పడితే కేసు పెట్టగానే ఆస్తులను జప్తు చేయనుంది ఏసీబీ. ఆరు నెలల్లో చార్జిషీట్‌ దాఖలు చేసి.. ఏడాదిలోనే కోర్టు విచారణ పూర్తయ్యే విధంగా చూడనుంచి. 
బీహర్, ఒడిస్సాలో అమలవుతున్న స్పెషల్‌ కోర్ట్‌ యాక్ట్‌ 2016 
ఇప్పటివరకు బీహర్‌, ఒడిస్సా రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న స్పెషల్‌ కోర్ట్‌ యాక్ట్‌ 2016 ఇక నుంచి ఏపీలోనూ అమలుకానుంది. ఇప్పటికే ఈ చట్టం కింద ఏసీబీ అధికారులు ఒక కేసును నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న విజయనగరం ఎస్‌ఐ గణేశ్వరరావు కేసును ప్రత్యేక కోర్ట్ ఫైల్ నమోదు చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు కావటంతో దీనినే తొలి కేసుగా ఎంపిక చేసుకున్నారు అధికారులు.గణేశ్వరరావుపై 11 సివిల్‌ కేసులు ఉన్నాయని.. 4 సార్లు ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయ్యారని ఏసీబీ అధికారులు తెలిపారు. 
నేరం రుజువైతే ఆస్తులు శాశ్వతంగా ప్రభుత్వం ఆధీనంలోకి
ఇప్పటివరకు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నారు ఏసీబీ అధికారులు. తర్వాత దీనిపై దర్యాప్తు జరిపి ఆధారాలతో చార్జిషిట్‌ దాఖలు చేస్తున్నారు. అయితే కోర్టు తీర్పు వెలువడేంత వరకు ఏసీబీ అటాచ్‌ చేసిన ఆస్తులను విక్రయించకునేందుకు వీలు లేకపోయినా నిందితులు, వారి కుటుంబాలే అనుభవిస్తున్నాయి. మరోవైపు కోర్టులో శిక్ష ఖరారైనా గరిష్టంగా మూడేళ్ల శిక్ష, కొద్ది మొత్తం జరిమానా విధించటంతో అవినీతి అధికారుల్లో భయం ఉండటం లేదు. దీంతో అధికారులు తమ అవినీతి పరంపరను అలాగే కొనసాగిస్తున్నారు. అయితే ఇలాంటివి ఇక మీదట చెల్లుబాటు కాబోవని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసు నమోదు చేసిన నెల రోజుల్లోగా.. వారి ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయని అంటున్నారు. నేరం రుజువైతే ఆస్తులు శాశ్వతంగా ప్రభుత్వం ఖజానాకే పరిమితం కానున్నాయి. ఒకవేళ నేరం రుజువు కాకపోతే ఐదుశాతం వడ్డీతో ఆస్తులను బాధితులకు అందించనుంది ప్రభుత్వం. స్పెషల్‌ కోర్ట్‌ యాక్ట్‌ 2016 అమల్లోకి రానుడటంతో ఇక మీదటనైనా అవినీతి అధికారుల్లో మార్పు వస్తుందేమో చూడాలి. 

 

Don't Miss